1 కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమవలన ఏ దుఃఖోపశమనమైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసవాత్సల్యములైనను ఉన్నయెడల
2 మీరు ఏకమనస్కులగునట్లుగా ఏక ప్రేమకలిగి, యేకభావముగలవారుగా ఉండి, ఒక్కదానినే మనస్కరించుచు నా సంతోషమును సంపూర్ణముచేయుడి.
3 కక్షచేతనైనను వృధాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు
4 మీలో ప్రతివాడును తన స్వకార్యములనుమాత్రమేగాక యితరుల కార్యములనుకూడా చూడవలెను.
5 క్రీస్తుయేసుకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.
6 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని.
7 మనుష్యుల పోలికగాపుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్నుతానే రిక్తునిగా చేసికొనెను.
8 మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయతచూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
9-10. అందుచేతను పరలోకముందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమిక్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమునవంగునట్లును,
11 ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
12 కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులై యున్నప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ స్వరక్షణను కొనసాగించుకొనుడి.
13 ఈ విషయములో మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలోకార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.
14-15. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని సమస్త కార్యములనుచేయుడి.
16 అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. ఇందువలన నేను వ్యర్ధముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయకారణము కలుగును.
17 మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనానందించి మీ యందరితోకూడ సంతోషంతును.
18 ఇటువలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి.
19 నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చుచుకొను నిమిత్తము తిమొథెయును శీఘ్రముగా మీయొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను.
20 మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతనివంటివాడెవడును నాయొద్ద లేడు.
21 అందరును తమ స్వకార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు.
22 అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవచేసెను.
23 కాబట్టి నాకేమి సంభవింపనైయున్నదో చూచినవెంటనే అతని పంపవలెనని అనుకొనుచున్నాను.
24 శీఘ్రముగా వచ్చెదనని ప్రభువునుబట్టి నమ్ముచున్నాను.
25 మరియు నా సహోదరుడును, జతపనివాడును, నాతోటియోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించినవాడునైన ఎపఫ్రొదితును మీయొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని.
26 తాను రోగియాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని (చూడ) మిగుల అపేక్షగలవాడై విచారపడుచుండెను.
27 నిజముగా అతడు రోగియై చావుకు సిద్ధమై యుండెను గాని దేవుడతని కనికరించెను; అతని మాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను.
28 కాబట్టి మీరు అతని చూచి మరల సంతోషించునిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గునిమిత్తమును అతని మరి శీఘ్రముగా పంపితిని.
29-30. అతడు నాయెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్కపనినిమిత్తము చావుకు సిద్ధమైయుండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.
Download Audio File

No comments:
Post a Comment